త్వరలో సెట్స్ పైకి రాజ్ తరుణ్ 'లవర్'
- రాజ్ తరుణ్ హీరోగా 'లవర్'
- కథానాయికగా గాయత్రి సురేష్
- వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్
- ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచన
దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించే ఈ సినిమాలో, రాజ్ తరుణ్ సరసన గాయత్రి సురేశ్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాకి 'లవర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బైక్ మెకానిక్ పాత్రలో రాజ్ తరుణ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడట. క్రితం నెలలోనే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. చకచకా షూటింగును కానిచ్చేసి .. ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.