'శైలజా రెడ్డి అల్లుడు'లో చైతూకి అత్తగా శ్రీదేవి?
- మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- చైతూ అత్త పాత్ర కోసం రమ్యకృష్ణతో సంప్రదింపులు
- తాజాగా తెరపైకి శ్రీదేవి పేరు
నాగార్జున జోడీగా చేసిన శ్రీదేవి .. చైతూకి అత్తగా చేస్తే ఈ ప్రాజెక్టుకు ఒక రేంజ్ లో క్రేజ్ వస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. శ్రీదేవి ప్రధాన పాత్ర చేసినట్టయితే, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చునని భావిస్తున్నారట. అవసరమైతే నాగ్ మాట సాయం తీసుకుందామనే ఆలోచనలో మారుతి వున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్. ఫైనల్ గా ఈ సినిమాలో శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందో .. శ్రీదేవి మెరుస్తుందో చూడాలి.