అవును! నేను నటిని కాకముందే చాలామందితో డేటింగ్ చేశా: బాలీవుడ్ భామ భూమి
- తన వ్యక్తిగత విషయాలను తొలిసారి వెల్లడించిన నటి
- హీరోలతో లింకులు పెట్టే అవకాశం లేదని వ్యాఖ్య
- తానిప్పుడు పనినే పెళ్లాడానంటూ చమత్కారం
భూమి ఇప్పటి వరకు చేసింది మూడు సినిమాలే అయినా రూమర్లు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. దీంతో స్పందించిన ఆమె.. తాను ఆయుష్మన్ ఖురానా, అక్షయ్ కుమార్‌లతో నటించానని, వారిద్దరికీ పెళ్లయి, సెటిలయ్యారు కాబట్టి వారితో తనకు లింకు పెట్టే అవకాశం లేదని చెప్పుకొచ్చింది.
గతంలో భూమి ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు. అయితే ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాల హిట్‌తో ఆమె వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఉత్సుకత మొదలైంది. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి అడిగినప్పుడు పై విధంగా స్పందించింది.