రెమ్యునరేషన్ ఎంత ఎక్కువిచ్చినా రాత్రివేళ పనిచేయను!: పోసాని
- ఈ మధ్య కాలంలో నటుడిగా పోసాని బిజీ బిజీ
- రాత్రివేళ షూటింగ్ అంటే మాత్రం నో చెప్పేస్తారట
- ఆరోగ్యం దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం
- ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా ఇది మారదు
- 'పైసా వసూల్' అందుకే వదిలేశాడట
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంత సేపైనా షూటింగులో పాల్గొనడానికి తనకి అభ్యంతరం లేదని అన్నారు. అయితే రాత్రి సమయాల్లో మాత్రం పనిచేయదలచుకోలేదని చెప్పారు. ఎంత రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోదలచుకోలేదని అన్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఈ కారణంగా కొన్ని పెద్ద సినిమాలను కూడా వదులుకోవలసి వచ్చిందని చెప్పారు. అలాంటి సినిమాల్లో 'పైసా వసూల్' కూడా ఒకటని స్పష్టం చేశారు.