'గౌతమ్ నంద'లో గోపీచంద్ నెగెటివ్ రోల్ పై టాక్!
సాధారణంగా తెరపై ఎప్పుడూ హీరోలుగా అదరగొడుతోన్న వాళ్లు .. హఠాత్తుగా నెగెటివ్ రోల్ ను చేస్తే కొత్తగా అనిపిస్తుంది కనుక ఆసక్తికరంగా చూస్తారు. కానీ గోపీచంద్ విషయంలో అలా జరగడం లేదట. ఆల్రెడీ గోపీచంద్ 'జయం' .. 'వర్షం' వంటి సినిమాల్లో విలన్ గా అదరగొట్టేశాడు. ఆయనలో ఆ స్థాయి విలనిజాన్ని ముందే చూసి ఉండటం వలన .. 'గౌతమ్ నంద'లోని నెగెటివ్ రోల్ ఆడియన్స్ కి ఆనడం లేదని చెప్పుకుంటున్నారు.