కనీసం గోనె సంచులు కూడా సమకూర్చలేకపోతున్నారు: గండ్ర వెంకటరమణారెడ్డి
- మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ ధ్వజం
- అన్నదాతలు రోడ్లపై అల్లాడుతున్నారన్న గండ్ర
- రేవంత్ నకిలీ రైతు బిడ్డ అని ఎద్దేవా
ముఖ్యమంత్రికి 75 సార్లు ఢిల్లీ వెళ్లడానికి సమయం ఉంది కానీ, రైతుల కష్టాలు పట్టించుకోవడానికి తీరిక లేదని... రేవంత్ 'నకిలీ రైతు బిడ్డ' అని గండ్ర ఎద్దేవా చేశారు. క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని, గతంలో కేసీఆర్ కరోనా సమయంలోనూ ప్రతి గింజా కొన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే బీఆర్ఎస్ తరపున పోరాటాలు ఉద్ధృతం చేస్తామని గండ్ర హెచ్చరించారు.