అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్యకు హైకోర్టులో చుక్కెదురు
- ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
- కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్న కోర్టు
- పల్నాడు జిల్లాలో మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్ 29న కేసు నమోదు
విచారణ సందర్భంగా, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, నిందితుడైన చిన్న మల్లయ్య పరారీలో ఉన్నారని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మహిళ, తనపై సీఐ చిన్న మల్లయ్య లైంగిక దాడికి పాల్పడ్డారని ఏప్రిల్ 29న వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చిన్న మల్లయ్య పరారీలో ఉండగా, పోలీసు శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది.