వినూత్న రీతిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం... ఫొటో రౌండప్ ఇదిగో!
- మంగళగిరిలో ఘనంగా జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
- ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- నూతన పంథాలో వేడుకలు.. వేదికపైకి సామాన్య కార్యకర్తలు
- కార్యకర్తే పార్టీకి అధినేత అనే నినాదానికి పెద్దపీట వేసిన అధిష్టానం
- పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తూ సభ నిర్వహణ
ఈ ఆవిర్భావ సభను "కార్యకర్తే అధినేత" అనే నినాదాన్ని ప్రతిబింబించేలా నిర్వహించడం విశేషం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన 19 మంది సామాన్య కార్యకర్తలను వేదికపై కూర్చోబెట్టి గౌరవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలు సభికుల మధ్యలో ఆశీనులయ్యారు. గత ప్రభుత్వ హయాంలో వేధింపులు ఎదుర్కొన్న వారికి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారికి ఈ వేదికపై ప్రాధాన్యం ఇచ్చారు.
సభా నిర్వహణ బాధ్యతలను యువ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మకు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కార్యకర్తలు పార్టీతో తమకున్న అనుబంధాన్ని, తాము చేసిన సేవను భావోద్వేగంతో పంచుకున్నారు. తమ లాంటి సామాన్య కార్యకర్తలను గౌరవించే ఏకైక పార్టీ టీడీపీనేనని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.












