ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే: మరో ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
- పద్మనాభస్వామి ఆలయ అద్భుత దృశ్యాలు షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- విషువత్తు రోజుల్లో ఆలయ గోపురంతో సూర్యుడి అద్భుత కలయిక
- సైన్స్, ఆధ్యాత్మికత కలయిక చూసి ఆశ్చర్యపోయానంటూ వ్యాఖ్య
- ఈ దృశ్యాన్ని కళ్లారా చూడటం తన లిస్ట్‌లో ఉందన్న మహీంద్రా
విషువత్తు (equinox) రోజుల్లో, అంటే పగలు-రాత్రి సమానంగా ఉండే రోజుల్లో, సూర్యాస్తమయ సమయంలో అస్తమిస్తున్న సూర్యుడు ఆలయ గోపురంలోని కిటికీల గుండా ఒక క్రమ పద్ధతిలో కనిపించే దృశ్యాన్ని చూసి ఆయన ముగ్ధులయ్యారు. "శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో సౌర గమనం, జ్యామితిపై ఇంతటి అవగాహన ఉండటం అద్భుతం. ఒకప్పుడు సైన్స్, ఆధ్యాత్మికత వేర్వేరు కాదని, అవి రెండూ ఒకదానికొకటి బలాన్నిచ్చేవని ఇది చూస్తే అర్థమవుతుంది" అని తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
ఈ అద్భుత దృశ్యాన్ని తన జీవితంలో ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నానని, దీనిని తన 'అర్జంట్ గా చూడాల్సిన జాబితా'లో చేర్చానని మహీంద్రా తెలిపారు. "ఇటీవలే శుక్రవారం వచ్చిన వసంత విషువత్తును నేను మిస్ అయ్యాను. కానీ ఏడాదిలో రెండుసార్లు వచ్చే ఈ అవకాశం కోసం నా క్యాలెండర్‌లో తేదీలను గుర్తుపెట్టుకున్నాను" అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆలయ విశిష్టతను మరోసారి అందరికీ గుర్తుచేస్తోంది.