హిమాయత్‌సాగర్ లో యువకుడి దారుణ హత్య
- మృతుడు టోలిచౌకికి చెందిన వ్యాపారి మహ్మద్ అమీర్‌గా గుర్తింపు
- హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని కుటుంబం ఆరోపణ
- పాత కక్షల కోణంలో రాజేంద్రనగర్ పోలీసుల దర్యాప్తు
మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి మహ్మద్ అమీర్‌గా పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారమే అమీర్‌ను హత్య చేసి, ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలు లేదా ఇతర కారణాల వల్ల ఈ హత్య జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.