ఈ ఘటనలను వైసీపీ ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- ఏఐ సమ్మిట్ లో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
- కాంగ్రెస్ ప్రవర్తన దేశ గౌరవాన్ని తగ్గించిందన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- కాంగ్రెస్‌ను ఖండించని వైసీపీపైనా విమర్శలు
- దేశ ప్రయోజనాల విషయంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లది ఒకే వైఖరి
- కాంగ్రెస్ పార్టీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
దేశ ప్రయోజనాల కంటే కాంగ్రెస్‌కు స్వార్థ రాజకీయాలే ముఖ్యమని లావు విమర్శించారు. భారత్ అభివృద్ధి చెందకూడదు, యువతకు ఉద్యోగాలు రాకూడదు అనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనలను వైసీపీ ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో 'తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్'ల వైఖరి ఒకటేనని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ వెంటనే దేశ ప్రజలకు, ప్రపంచానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. రాజకీయాలు దేశ ప్రతిష్ఠకు అతీతంగా ఉండాలని హితవు పలికారు. ఇలాంటి అడ్డంకులు ఎదురైనా భారత్ ప్రగతి ఆగదని, దేశ గౌరవాన్ని అవమానించేవారిని ప్రజలు క్షమించరని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు.