హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్
- విమానం ల్యాండ్ అవగానే తనిఖీలు చేపట్టిన సిబ్బంది
- బాంబు లభ్యం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి 23 నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కొన్ని ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు కూడా గుర్తించారు.