శివతత్వ చీరలు ధరించి సీఎం చంద్రబాబును కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు... ఫొటోలు ఇవిగో!
- అసెంబ్లీలో ఆధ్యాత్మిక శోభ
- ఒకే రకమైన చీరల్లో కూటమి మహిళా ప్రజాప్రతినిధులు
- స్పీకర్ అయ్యన్న, మంత్రి పయ్యావుల, బాలకృష్ణలతోనూ భేటీ
ఒకే రకమైన వస్త్రధారణతో అసెంబ్లీకి విచ్చేసిన మహిళా ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్. సవితతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మహిళా నేతలు ఈ విధంగా ప్రత్యేకతను చాటడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం, అసెంబ్లీ లాబీల్లో ఈ మహిళా ప్రజాప్రతినిధులు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను కూడా కలిసి మాట్లాడారు. దీంతో శాసనసభ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది.







