సీతతో విడిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నా: పార్తీబన్
- 1990లో ప్రేమ వివాహం చేసుకున్న సీత, పార్తీబన్
- 12 ఏళ్ల తర్వాత విడిపోయిన జంట
- సీతలో విడిపోయినందుకు బాధ లేదన్న పార్తీబన్
సీతతో తన వివాహం, విడిపోవడంపై పార్తీబన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... సీతతో విడిపోయినందుకు తాను ఎప్పుడూ బాధపడలేదని చెప్పారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే, ఆమెతో ఉన్న 12 సంవత్సరాలు తన జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పారు. ఈ రోజుల్లో పురుషులు కానీ, మహిళలు కానీ వివాహం చేసుకోవడం కంటే స్వతంత్రంగా ఉండానికే ఇష్టపడతారని... ఏ మహిళ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. పార్తీబన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.