బాలకృష్ణపై నటి లయ ఆసక్తికర కామెంట్స్
- బాలయ్య సెట్స్ లో ఉంటే ఆ ఎనర్జీ వేరన్న లయ
- ఆయనతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
- మరోసారి అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించాలనేది తన కోరికన్న లయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ మాట్లడుతూ నటసింహం బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య సినిమా 'విజయేంద్రవర్మ'లో లయ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో బాలకృష్ణతో ఏర్పడిన అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు.
బాలయ్యగారు సెట్లో ఉంటే ఆ ఎనర్జీ వేరుగా ఉంటుందని లయ అన్నారు. ఆయన ఎంతో డిసిప్లిన్ గా ఉంటారని, అదే సమయంలో సహ నటీనటులతో ఎంతో సరదాగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటారని చెప్పారు. ఆయనతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవం అని అన్నారు. అవకాశం వస్తే మరోసారి ఆయనతో కలిసి నటించాలనేది తన కోరిక అని చెప్పారు. లయ కోరికను ఏ దర్శకుడైనా నెరవేరుస్తారేమో వేచిచూడాలి.