నన్ను బెదిరిస్తున్నారు.. నాకు ప్రాణహాని ఉంది: బంజారాహిల్స్ పీఎస్ లో కేకే కుమారుడి ఫిర్యాదు
- కేకే కుమారుడు వెంకట్ కు బెదరింపులు
- బంజారాహిల్స్ లో 11 వందల గజాల స్థల వివాదం
- రూ. 3 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని వెంకట్ ఫిర్యాదు
ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే తమకు రూ. 3 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్టు వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.