పవన్‌పై బండ్ల గణేశ్ భక్తి.. పాటగా వచ్చేసింది!
- శివాజీ, లయల కొత్త చిత్రం నేరుగా ఓటీటీలోకి
- ‘పాయా పాయా’ పాటలో బండ్ల గణేశ్ స్పెషల్ అట్రాక్షన్
- పవన్ కల్యాణ్‌పై తన ఫేమస్ డైలాగ్‌తో అదిరిపోయే స్టెప్పులు
- ఈ నెల 12 నుంచి ‘ఈటీవీ విన్’లో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ స్ట్రీమింగ్
ఫుడ్ ఫెస్టివల్ నేపథ్యంలో కలర్‌ఫుల్‌గా చిత్రీకరించిన ఈ పాటలో బండ్ల గణేశ్ ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఆయనతో పాటు కమెడియన్ అలీ, బబ్లూ, భోలే శావలి కూడా సందడి చేశారు. ఈ పాటకు విశేషం ఏమిటంటే, పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్‌కు ఉన్న అభిమానాన్ని ఇందులో హైలైట్ చేశారు. గతంలో వైరల్ అయిన తన "ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా" అనే డైలాగ్‌ను ఈ పాటలో రీమిక్స్ చేశారు. పవన్ మేనరిజాన్ని అనుకరిస్తూ బండ్ల వేసిన స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
“పవన్ కల్యాణ్ అన్న కూడా హైదరాబాద్ సే పాయా మంగాయా… హిట్ల మీద హిట్లతో పవర్ స్టార్ బన్ గయా” వంటి సాహిత్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ పాటలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సీఎం చంద్రబాబును కూడా ప్రస్తావిస్తూ బండ్ల గణేశ్ స్టెప్పులు వేశారు. ఈ పాటపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బండ్ల గణేశ్ ఎనర్జీని మెచ్చుకుంటుంటే, మరికొందరు ట్యూన్ బాగాలేదని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ పాట సినిమాకు ఏ మేరకు ప్రచారం తెచ్చిపెడుతుందో చూడాలి.