హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్కు’.. నగరంలో రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు
- హైదరాబాద్‌లో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు
- పోలీసుల ఆంక్షలు బేఖాతర్ చేసిన మందుబాబులు
- ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసుల నమోదు
- తెల్లవారుజాము వరకు తనిఖీలు.. భారీగా వాహనాల సీజ్
న్యూ ఇయర్ సందర్బంగా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఒక్క రాత్రికే 1,198 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.