తంతే బూరెల బుట్టలో పడ్డట్లు రేవంత్ సీఎం అయిండు: జగదీశ్ రెడ్డి
- గల్లీ స్థాయి లీడర్ నని నిరూపించుకున్నాడని మండిపాటు
- కేసీఆర్ స్థాయి కాదని గుర్తుంచుకోవాలంటూ వార్నింగ్
- ఇతరుల చావు కోరుకోవడమనేది రండ గాళ్లు చేసే పనంటూ ఘాటు వ్యాఖ్యలు
ఈమేరకు జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నువ్వు రండవు అని అనడం మాకూ వచ్చు, నీకు ఒక భాష మాత్రమే తెలుసు కానీ మాకు అన్ని భాషలు వచ్చు. మేం కూడా నీ భాషలో మాట్లాడగలం. కానీ మేము నీలాగ మాట్లాడడం లేదు. నీ నోరు కంపు అని, సీఎం స్థాయికి తగవని, గల్లీ స్థాయి నాయకుడివని మరోమారు నిరూపించుకున్నావు. ఇతరుల చావు కోరుకోవడం రండగాళ్లు చేసే పని. వచ్చే జనరల్ ఎన్నికల్లో ప్రజలే నిన్ను బండరాళ్లు కట్టి మూసీలో పడేస్తారు” అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.