2 గంటలకు బాంబు పేలుతుంది: నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్
- జడ్జిలు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టిన పోలీసులు
- బెదిరింపుకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ పోలీసుల యత్నం
కోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈ బెదిరింపు సందేశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.