తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామ సమీపంలో దుర్ఘటన
- పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళుతుండగా ప్రమాదం
- మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల వాసులుగా గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ కుటుంబం హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మృతులను లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.