87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- ఈ నెల 24 నుంచి విజయవాడలో జరగనున్న పోటీలు
- పదేళ్ల తర్వాత ఏపీకి దక్కిన ఆతిథ్య అవకాశం
- టోర్నీ ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించిన క్రీడామంత్రి
ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. పదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి సీఎంకు వివరించారు. టోర్నమెంట్ నిర్వహణకు క్రీడా శాఖ, పురపాలక శాఖ, శాప్ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలను, నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, టోర్నమెంట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.