సినీ నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు
- కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న మీరా మిథున్
- 2022లో అరెస్టు వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం
- మూడేళ్లుగా ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు
- ఢిల్లీ హోంలో ఉన్నట్టు కోర్టుకు తెలిపిన పోలీసులు
- అరెస్టు చేసి ఈ నెల 11న హాజరుపర్చాలని ఆదేశించిన కోర్టు
2021 ఆగస్టులో అరెస్టు చేయగా, నెల రోజులకు ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో మీరా మిథున్‌పై 2022లో నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. అరెస్టు వారెంట్ జారీ అయి మూడేళ్లు అవుతున్నా ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్న మీరా మిథున్‌ను రక్షించాలని కోరుతూ ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రాగా, పోలీసుల తరపున న్యాయవాది ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను రక్షించి అక్కడున్న హోంకి తరలించినట్లు తెలిపారు. ఢిల్లీ హోంలో ఉన్న మీరా మిథున్‌ను అరెస్టు చేసి ఈ నెల 11న హాజరుపరచాలని న్యాయమూర్తి చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.