'వార్ 2' లవ్ సాంగ్‌పై జూనియర్ ఎన్టీఆర్ అప్‌డేట్
- హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రలో 'వార్ 2'
- అయాన్ ముఖర్జీ దర్శకత్వం.. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం
- హీరోయిన్‌గా కియారా అద్వానీ
- కియారా, హృతిక్ మధ్య వచ్చే లవ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
- ఊపిరి ఊయలగా అంటూ సాగే ఈ పాట ప్రోమోను షేర్ చేసిన తారక్
ఇప్పటికే మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్లను విడుదల చేశారు. తాజాగా కియారా, హృతిక్ మధ్య వచ్చే లవ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. తెలుగులో ఊపిరి ఊయలగా అంటూ సాగే ఈ పాట ప్రోమోను తారక్ తన 'ఎక్స్' ఖాతాలో షేర్ చేశారు. "ప్రేమ అప్రయత్నంగా ఉన్నప్పుడు, అది ఒక కలలా అనిపిస్తుంది... రేపు విడుదలయ్యే ఊపిరి ఊయలగా పాట కోసం సిద్ధంగా ఉండండి!" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.