విశాఖలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్... వేగంగా పనులు!
- విశాఖలో అత్యంత లగ్జరీగా ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్
- మొత్తం 8 స్క్రీన్లతో నిర్మాణం
- వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రారంభం!
దక్షిణ భారతదేశంలోనే ఇది అత్యంత పెద్ద ఇనార్బిట్ మాల్ కాగా, ఇందులో అల్లు అర్జున్ నిర్మించబోయేది అత్యంత లగ్జరీ థియేటర్ అని తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ కు అవసరమైన ఎక్విప్ మెంట్, ఫర్నిచర్ మొత్తం విదేశాల నుంచి తీసుకువస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.