రిపోర్టర్‌పై దాడి కేసు.. మోహన్ బాబు పిటిషన్‌పై విచారణ వాయిదా
- విలేకరిపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై కేసు నమోదు
- పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టివేతకు పిటిషన్
- విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం
గతంలో రంజిత్ అనే విలేకరిపై దాడి చేశారన్న ఆరోపణలతో మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుకు సంబంధించి మోహన్‌బాబుకు ఇదివరకే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.