కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
- ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్ప
- ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించిన విష్ణు
- ప్రభాస్ తనకు కృష్ణుడు లాంటి వాడన్న విష్ణు
ఈ సందర్భంగా ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు విష్ణు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు లాంటి వాడని అన్నారు. వాస్తవానికి ప్రభాస్‌కు ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేదని కానీ, మా నాన్న మోహన్ బాబుపై ఉన్న ప్రేమతో నటించాడని విష్ణు పేర్కొన్నారు.
ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని విష్ణు అన్నారు. మానవత్వం కలిగి ఉన్న ప్రభాస్ నుంచి ఈ తరం చాలా విషయాలు నేర్చుకోవాలన్నారు. డబ్బు, పేరు రాగానే కొందరు మారిపోతుంటారని, కానీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ ఇప్పటికీ మారలేదని విష్ణు కొనియాడారు.