కుప్పం మహిళ శిరీషను ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
- కుప్పంలో దారుణ ఘటన
- అప్పు తీర్చకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త
- భార్యను చెట్టుకు కట్టేసిన వైనం
- రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- పిల్లలను బాగా చదివించాలని సూచన
ఇక, శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో కూడా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని....ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి... అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్లో సీఎం హామీ ఇచ్చారు. ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.