వార్నర్ ఇంట్రో వీడియో రిలీజ్ చేసిన 'రాబిన్ హుడ్' మేకర్స్... చేతిలో తుపాకీ, చుట్టూ బికినీ గాళ్స్!
వార్నర్ ఒక డాన్ లా వ్యవహరించడం ఇందులో చూడొచ్చు. వార్నర్ పాత్ర పేరు డేవిడ్ భాయ్. చేతిలో తుపాకీ, చుట్టూ బికినీ గాళ్స్... లగ్జరీ బోట్ పై విహారాలు, హెలికాప్టర్ లో జర్నీలు... ఇలా ఇంట్రో వీడియోలో వార్నర్ రోల్ రిచ్ గా కనిపిస్తోంది.
చివర్లో మరో వ్యక్తిని నీకు లాలీపాప్ కావాలా అని వార్నర్ అడగడం, నాకొద్దు అని ఆ వ్యక్తి తల అడ్డంగా ఊపడం... సీన్ కట్ చేస్తే ఆ వ్యక్తి చచ్చిపడి ఉండగా, అతడి నోట్లో లాలీపాప్ పెట్టిన వార్నర్... "లాలీపాప్స్ ఆర్ రెడ్... ఎనిమీస్ ఆర్ డెడ్" అని డైలాగ్ చెప్పడం అలరిస్తుంది.