గన్ అప్పగించిన మోహన్ బాబు
- ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి పీఎస్‌లో తన గన్‌ను సరెండర్ చేసిన మోహన్ బాబు
- ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసుల ఆదేశం
- ఈరోజు హైదరాబాద్ నుంచి చంద్రగిరి వెళ్లి గన్ అప్పగించిన నటుడు
మరోవైపు జల్‌పల్లిలో తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్ బాబు తాజాగా మరోసారి మాట్లాడారు. తాను ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుపై దాడి చేయలేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి జర్నలిస్టులను ఆయన క్షమాపణలు కోరారు. ఇక ఆదివారం నాడు దాడిలో గాయపడిన జర్నలిస్టును ఆసుపత్రికి వెళ్లి మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు పరామర్శించిన విషయం తెలిసిందే.