ఫ్యామిలీతో కలిసి 'దేవర' మూవీ చూసిన జక్కన్న.. ఇదిగో వీడియో!
- నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'దేవర'
- మూవీకి పాజిటివ్ టాక్
- థియేటర్ల వద్ద పండగ వాతావరణం
- బాలానగర్‌లోని మైత్రి విమల్ థియేటర్‌లో సినిమా చూసిన రాజమౌళి
దీంతో సినిమా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా మూవీని వీక్షిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూశారు.
బాలానగర్‌లోని మైత్రి విమల్ థియేటర్‌కు భార్య రమ, కుమారుడు కార్తీకేయ, కోడలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అనంతరం సినిమా హాల్లో మిగతా ప్రేక్షకులను విష్ చేశారు. వారితో కలిసి మూవీ వీక్షించారు.
ప్రస్తుతం రాజమౌళి దేవర వీక్షించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్‌లో ఈ సినిమాను చూశారు.