పార్కింగ్ లో ఆడుకుంటున్న పాపపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో!
- ఆగ్రాలో తల్లిదండ్రుల కళ్లెదుటే ప్రమాదం
- హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ చిన్నారి మృత్యువాత
మాల్ లో షాపింగ్ పూర్తిచేసుకుని పాపతో పార్కింగ్ ఏరియాలోకి వచ్చిన తల్లిదండ్రులు ఏదో విషయంపై మాట్లాడుకుంటున్నారు. పాప అక్కడే తిరుగుతూ ఆడుకుంటోంది. ఇంతలో ఓ కారు లోపలికి రావడం, పార్కింగ్ కోసం రివర్స్ చేసుకోవడం చూడొచ్చు. పాప ఆడుకుంటూ ఆ కారు ముందుకు రావడం గమనించని డ్రైవర్.. కారును ముందుకు కదిలించాడు. దీంతో పాప కింద పడిపోగా కారు ముందు టైర్ పైకెక్కింది. పాప ఏడుపుతో తల్లి ఈ ఘోరాన్ని గమనించింది. హడావుడిగా అదే కారులో పాపను ఆసుపత్రికి తరలించారు. అయితే, పాపను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు.