Balaramudu - Revathi: శ్రీకృష్టుడి మధ్యవర్తిత్వం.. బలరాముడి ప్రేమ వివాహం! ఆశ్చర్యం గొలిపే ఫ్లాష్‌బ్యాక్!
- బలరాముడి వివాహం గురించి ప్రచారంలో పలు ఆసక్తికర విషయాలు
- రేవతిని చూసి తొలి చూపులోనే ప్రేమించిన బలరాముడు
- తన మధ్యవర్తిత్వంతో బలరాముడిని ఒక ఇంటివాడిని చేసిన శ్రీకృష్టుడు
- ఆశ్చర్యం గొలిపే ప్లాష్ బ్యాక్ ఈ వీడియోలో..
జగద్గురువు శ్రీకృష్ణుడి లీలలు, చిలిపిచేష్టలు అందరికీ తెలిసిందే. కానీ బలరాముడు మాత్రం ఇందుకు భిన్నంగా గంభీరంగా ఉండేవాడు. బలరాముడి గురించీ భక్తులకు కొంత వరకూ అవాగాహన ఉంది. ఆయన భార్య పేరు రేవతి అన్న విషయం కూడా చాలా మందికి తెలుసు. అయితే, వారి వివాహ వృత్తాంతం మాత్రం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. గురుకులంలో ఉండగానే బలరాముడు రేవతి ప్రజ్ఞాపాటవాలు, సౌందర్యం చూసి ప్రేమలో పడితే, ఆ విషయాన్ని బలరామకృష్ణుల గురువు సాందీపుడు, శ్రీకృష్ణుడు కూడా గమనించారట. చివరకు శ్రీకృష్ణుడే జోక్యం చేసుకుని తన అన్న వివాహానికి బాటలు వేశాడట. మరి రేవతి ఎవరు? గురుకులంలో ఆమె ఏం చేస్తోంది? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటో చాలా మందికి తెలియని ఆసక్తికర వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.