Mamata Benerjee: తెలుగు మీడియా ప్ర‌పంచానికి ఆయ‌న‌ ఓ దార్శనికుడు.. రామోజీ మృతిపై దీదీ ట్వీట్‌!

Mamata Benerjee Tweet on Ramoji Rao

  • రామోజీ రావు మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం
  • ఆయ‌న మరణవార్త తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్న దీదీ 
  • 'ఎక్స్' వేదిక‌గా ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్య‌మంత్రి

ఈనాడు సంస్థల అధినేత, తెలుగు మీడియా మొఘ‌ల్‌ రామోజీరావు మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలిపారు. ఈ మేరకు రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) లో ఓ పోస్టు పెట్టారు.

"ఈనాడు గ్రూప్‌, ఈటీవీ నెట్‌వర్క్‌, ఫిల్మ్‌ సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మరణవార్త తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్‌ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన ఓ దార్శనికుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మంచి పరిచయం ఉంది. ఓసారి ఫిల్మ్‌సిటీకి నన్ను ఆహ్వానించారు. ఫిల్మ్‌సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని దీదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News