Sreeleela: మరోసారి రవితేజ జోడీ కడుతున్న శ్రీలీల!

Sreeleela Special

  • గతంలో 'ధమాకా'లో సందడి చేసిన శ్రీలీల
  • రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో సినిమా  
  • సితార బ్యానర్లో రూపొందే సినిమా ఇది


టాలీవుడ్ లో కెరియర్ ను మొదలుపెడుతూనే రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయిన కథానాయికల జాబితాలో శ్రీలీల కనిపిస్తుంది. అందం .. అభినయం .. డాన్స్  .. ఈ మూడు విషయాల్లో వంకపెట్టలేని హీరోయిన్ ఆమె. అలాంటి శ్రీలీలకు ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురవుతూ రావడం ఆమె అభిమానులను నిరాశపరిచిన అంశం. 

శ్రీలీల చేసిన 'ఆదికేశవ' .. 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్' సినిమాలు చాలా దారుణమైన పరాజయాలను చూశాయి. ఆ తరువాత వచ్చిన 'గుంటూరు కారం' యావరేజ్ టాక్ నే తెచ్చుకుంది. ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి రవితేజతో కలిసి సందడి చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.  

ప్రస్తుతం రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన సితార బ్యానర్లో చేయనున్నట్టుగా సమాచారం. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా కోసం కథానాయికగా శ్రీలీలను తీసుకోనున్నారని సమాచారం. అదే నిజమైతే, 'ధమాకా' తరువాత ఈ జంట సందడి చేసే సినిమా ఇదే అవుతుంది. 

  • Loading...

More Telugu News