చిరాగ్ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ.. 22 మంది సీనియర్ నేతల రాజీనామా!
- చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జన శక్తి పార్టీలో కుదుపు
- పార్టీ వీడిన వారిలో రేణు కుశ్వాహా, సతీశ్ కుమార్, సంజయ్ సింగ్, రవీంద్ర సింగ్ వంటి కీలక నేతలు
- లోక్‌సభ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయన్న సీనియర్ నేతలు
- ఇకపై విపక్ష కూటమి 'ఇండియా'కు తాము మద్దతుగా నిలవబోతున్నట్లు ప్రకటన
అంతేగాక ఇకపై విపక్ష కూటమి 'ఇండియా'కు తాము మద్దతుగా నిలవబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ ఆయన సన్నిహితులు స్వయంగా లోక్‌సభ సీట్లను విక్రయిస్తున్నారని నేతలు ఆరోపించారు. వైశాలి, సమస్తీపూర్, ఖగడియా పార్లమెంట్ స్థానాల కోసం రూ. కోట్లలో తీసుకున్నారని ఆరోపణలు చేశారు. ఆయా స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసే సయమంలో కనీసం పార్టీలోని సీనియర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకోలేదని నేతలు దుయ్యబట్టారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షమైన లోక్‌జన శక్తి పార్టీకి సీనియర్ నేతల రాజీనామా భారీ ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.