ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ దాడి.. వీడియో షేర్ చేసిన పరిటాల శ్రీరామ్
- రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడి
- దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ
- వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది మరో నిదర్శనమన్న శ్రీరామ్
శ్రీకృష్ణపై జరగిన దాడి వీడియోను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది మరో నిదర్శనం అని ఆయన మండిపడ్డారు. సిద్ధం సభకు వస్తున్నది కార్యకర్తలా లేక గూండాలా అనే అనుమానం వస్తోందని అన్నారు. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పారు. అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.