ఎస్సీలను వైసీపీ నుంచి బయటికి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నా: మాజీ ఎంపీ హర్షకుమార్
- వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తిన జీవీ హర్షకుమార్
- రాష్ట్రంలో నలుగురు పెత్తందార్లు ఉన్నారని విమర్శలు
- సజ్జల, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఆ పెత్తందార్లు అని వెల్లడి
- తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ తరఫునే పోటీ చేస్తానని స్పష్టీకరణ
జీవీ హర్షకుమార్ 2004 నుంచి 2014 వరకు అమలాపురం ఎంపీగా కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2020 నుంచి మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు.