బాలు, చంద్రమోహన్, కె.విశ్వనాథ్.. మధ్య బంధుత్వం!
- ముగ్గురు దిగ్గజాలు అక్కాచెల్లెళ్ల కొడుకులే
- సినిమాల్లోకి వచ్చాకే బంధుత్వం గురించి తెలిసిందట!
- ఈ విషయం బయటపెట్టకుండా దాచేసిన దిగ్గజాలు
తొలుత ఎస్పీ బాలు, ఆపై కె.విశ్వనాథ్.. ఇప్పుడు చంద్రమోహన్ దివికేగారు. ఈ ముగ్గురూ అక్కాచెల్లెళ్ల పిల్లలేనట. కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య, చంద్రమోహన్ తల్లి, అక్కాచెల్లెళ్లు.. అలాగే చంద్రమోహన్ బావ మరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా ఈ ముగ్గురూ అన్నదమ్ములు. ఈ ముగ్గురు అన్నదమ్ములూ పనిచేసిన శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.