భర్తకు విడాకులు ఇస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం.. హరితేజ స్పందన
- 2015లో దీపక్ ను పెళ్లాడిన హరితేజ
- ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న హరితేజ
- తన భర్త ఫొటోను షేర్ చేసిన వైనం
2015లో దీపక్ అనే కన్నడ వ్యక్తిని హరితేజ పెళ్లాడింది. వీరికి భూమి అనే కూతురు ఉంది. తాజాగా తన భర్తకు హరితేజ విడాకులు ఇస్తోందనే వార్త బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఆమె ముచ్చటించే సందర్భంలో కూడా ఈ విషయం గురించి ఆమెను చాలా మంది డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె విడాకుల అంశంపై స్పందించింది. ఒక నాలుగు రోజులు సోషల్ మీడియాలో కనిపించపోవడంతో ఏవేవో రాసేస్తున్నారని మండిపడింది. తాను, తన భర్త అన్యోన్యంగానే ఉన్నామని చెప్పింది. తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. మరోవైపు తన స్నేహితులతో కలిసి హరితేజ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. కూతురుని తన తల్లి వద్ద విడిచిపెట్టి ఆమె ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లింది.