లోకేశ్ ఢిల్లీకి వెళ్తే ఏపీ రాజకీయాలు మారుతాయా?: మంత్రి కొట్టు
- లోకేశ్ ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన ఏమీ కాదన్న మంత్రి
- పవన్ కల్యాణ్ తీరు పెళ్లి ఒకరితో సంసారం మరొకరితో అన్నట్లుగా ఉందని వ్యాఖ్య
- జనసేనతో కలవడం వల్ల టీడీపీ నేతలు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న కొట్టు
- చంద్రబాబుకు సేవ చేయమని చెప్పగానే జనసైనికులు దండం పెట్టి వెళ్లారన్న మంత్రి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పెళ్లి ఒకరితో సంసారం మరొకరితో అన్నట్లుగా ఉందన్నారు. జైలుకెళ్లి సాష్టాంగ నమస్కారంతో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు. జనసేనతో కలవడం వల్ల ఎంతోమంది నేతలు టీడీపీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మరోవైపు, పవన్‌పై అభిమానంతో పార్టీకి సేవ చేయాలనుకున్న జనసైనికులు.. ఇప్పుడు చంద్రబాబుకు సేవ అనగానే సగం మంది జనసేనకు దండం పెట్టి వెళ్లిపోయారన్నారు.