క్లీంకారతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసిన ఉపాసన
- ఇటీవల తల్లయిన ఉపాసన
- కుమార్తెకు క్లీంకార అని పేరుపెట్టిన రామ్ చరణ్, ఉపాసన
- ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా వ్రతం చేసిన ఉపాసన
ప్రస్తుతం శ్రావణ మాసం. ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా తన నివాసంలో తొలిసారిగా వరలక్ష్మి వ్రతం నిర్వహించినట్టు ఉపాసన వెల్లడించారు. ఈ వ్రతంలో తనతో పాటు కుమార్తె క్లీంకార కూడా పాల్గొన్నట్టు తెలిపారు. ఇంతకంటే ఇంకేమీ కోరుకోను అంటూ ఆ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు.
వ్రతానికి సంబంధించిన ఫొటోను కూడా ఉపాసన పంచుకున్నారు. తన ఒళ్లో క్లీంకారను కూర్చోబెట్టుకుని ఫొటో తీయించుకున్నారు. అయితే ఫొటోలో క్లీంకార ముఖం కనిపించకుండా, ఎమోజీతో కవర్ చేశారు.