సెన్సార్ పూర్తిచేసుకున్న 'గాండీవధారి అర్జున'
- యాక్షన్ ఎంటర్టైనర్ గా 'గాండీవధారి అర్జున'
- వరుణ్ తేజ్ జోడీకట్టిన సాక్షివైద్య
- సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్
- ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. 'ఏజెంట్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన 'సాక్షి వైద్య' ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఆమె గ్లామరస్ గా కనిపించడమే కాదు .. భారీ యాక్షన్ దృశ్యాలలో పాల్గొనడం విశేషం. ఈ సినిమా తనకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆమె ఉంది.
ఈ సినిమా దాదాపు విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంది. ఆయా దేశాలలో చిత్రీకరించిన పాటలు .. ఫైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, థియేటర్లలో ఏ స్థాయిలో సందడి చేస్తుందనేది చూడాలి.