అమిత్ షా చూస్తుండగా రూ. 2,300 కోట్ల డ్రగ్స్ ధ్వంసం
- దేశ వ్యాప్తంగా 1,44,000 కేజీల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన ఎన్సీబీ
- హైదరాబాద్ యూనిట్ లో 6,590 కేజీల మాదకద్రవ్యాలు
- ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షించిన అమిత్ షా
ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రతినిధి మాట్లాడుతూ... ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ 6,590 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేసిందని ఇండోర్ యూనిట్ లో 822 కేజీలు, జమ్మూకశ్మీర్ యూనిట్ లో 4,069, గుజరాత్ యూనిట్ లో 2,458, హర్యానా యూనిట్ లో 4,069 కేజీలు ధ్వంసం చేసినట్టు తెలిపారు. మధ్య ప్రదేశ్ లో అత్యధికంగా 1,03,884 కేజీలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.