షారుఖ్ ‘పఠాన్’ కలెక్షన్లపై కాజోల్ కామెంట్లపై దుమారం!
- ఆ సినిమా అసలైన కలెక్షన్ చెప్పమని షారుఖ్ ను అగుతానన్న కాజోల్
- షారుఖ్ తో కలిసి ఏడు సినిమాల్లో నటించిన సీనియర్ నటి
- బాలీవుడ్ లో హిట్ జంటగా ఇద్దరికీ మంచి గుర్తింపు
తన తాజా వెబ్ సిరీస్ ‘ది ట్రయల్’ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్‌కు ‘ఇప్పుడు షారుఖ్ మీకు ఎదురైతే మీరు ఏం అడుగుతారు’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ‘పఠాన్’ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంతో చెప్పమని అడుగుతానంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. కాజోల్ సరదాగా ఈ మాట చెప్పినప్పటికీ ‘పఠాన్’ సినిమాకు వచ్చిన వెయ్యి కోట్ల కలెక్షన్స్ లో నిజం లేదని అర్థం ఉందటూ షారుఖ్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ తో పోటీపడే కాజోల్ భర్త అజయ్ దేవగణ్ ఆమెతో పఠాన్ కలెక్షన్ల గురించి చర్చించి ఉంటాడని, అందుకే ఆమె ఇలా ఎద్దేవా చేసిందని అంటున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.