డబ్బులు తక్కువగా ఉన్నప్పుడల్లా ఏం చేసేవారో చెప్పిన దిల్ రాజు!
- తొలిప్రేమ తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందన్న దిల్ రాజు
- తన జీవితాన్ని పుస్తకంలా రాస్తే తొలిప్రేమకు ఒక పూర్తి పేజీ ఉంటుందని వ్యాఖ్య
- నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ సినిమానే కారణమని వ్యాఖ్య
తొలిప్రేమ సినిమా వందో రోజునే ఇండియా - పాక్ మ్యాచ్ జరిగిందని, ఆ రోజు కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు సంధ్య థియేటర్ వద్ద భారీగా వరుస కట్టారన్నారు. ఇలాంటివి జరగడం ఓ చరిత్ర అన్నారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కు అయిదేళ్ల పాటు తనకు హక్కులు ఇచ్చారని, దీంతో డబ్బులు తక్కువగా ఉన్న ప్రతిసారి ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తూ వెళ్లానన్నారు. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి ఈ సినిమా ఒక కారణమన్నారు. ఇది తనకు ఎన్నో నేర్పించిందని చెప్పారు. తొలిప్రేమ రీరిలీజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడారు.