మోదీ, అమిత్ షా మధ్య విభేదాలు ఉన్నాయి: ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
- జగన్ ను మోదీ ఒక్క మాట కూడా అనడం లేదన్న సత్యనారాయణ
- అమిత్ షా, నడ్డాలు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
- జగన్ పై నమ్మకంతోనే ఏపీకి కేంద్రం రూ. 23 వేల కోట్లను ఇచ్చిందని వ్యాఖ్య
జగన్ ను అనేక సందర్భాల్లో మోదీ మెచ్చుకున్నారని సత్యనారాయణ అన్నారు. జగన్ మీద, వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం రూ. 23 వేల కోట్లను విడుదల చేసిందని చెప్పారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్నిసార్లు అడిగినా మోదీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్ పై మోదీకి ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పారు.