రక్తపు మరకలు తుడిచిన అవినాశ్ రెడ్డి గురించి జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు: బీటెక్ రవి
- అవినాశ్ పై సీబీఐకి కక్ష ఎందుకుంటుందన్న బీటెక్ రవి
- తప్పు చేశాడు కాబట్టే సీబీఐ దోషి అంటోందని వ్యాఖ్య
- సునీతకు తప్పకుండా న్యాయం జరుగుందన్న రవి
అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం ఖాయమని... సునీతకు తప్పకుండా న్యాయం జరుగుతుందని బీటెక్ రవి చెప్పారు. వివేకా హత్యతో టీడీపీకి సంబంధం లేదని... తమపై నిందలు మోపి రాజకీయంగా జిల్లాలో తిరగాలని అవినాశ్ చూస్తున్నాడని మండిపడ్డారు. నీ మంచితనం గురించి ప్రజలకు తెలియడానికి నీవేమీ పుచ్చలపల్లి సుందరయ్యవు కాదని ఎద్దేవా చేశారు.