'విరూపాక్ష' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్!
- సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
- అందాల సందడి చేయనున్న సంయుక్త
- సుకుమార్ స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం
- ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానున్న సినిమా
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా 'కలల్లో' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కలల్లోనే ఉలికిపడుతున్నా .. నిజాన్ని ఒక కొలిక్కి తేవేంటే. ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటు తేల్చవేమిటే" అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటను బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించారనే విషయం తెలుస్తోంది.
అజనీశ్ లోక్ నాథ్ స్వరపరిచిన ఈ పాటకి అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి - మధుశ్రీ ఆలపించారు. రాజు సుందరం కొరియోగ్రఫీని అందించాడు. ఇది హారర్ థ్రిల్లర్ కావడం .. దీనికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.