వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు బలహీనంగా ఉంటాయి. పొరపాటున కూడా వాటి వైపు వెళ్లొద్దు: టీఎస్ రెడ్కో ఛైర్మన్ వై. సతీశ్ రెడ్డి
- వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఆ రైళ్ల దగ్గరకు వెళ్లొద్దని బర్రెలకు విన్నవించిన సతీశ్ రెడ్డి
- మీరు రైళ్లని తాకితే అవి దెబ్బతింటాయని ఎద్దేవా
వందేభారత్ రైలును మోదీ ఈరోజు ప్రారంభిస్తున్నారని... ఆ రైళ్లు చాలా బలహీనంగా ఉంటాయని చెప్పారు. మీరు ఆ రైళ్ల వైపు పొరపాటున కూడా వెళ్లొద్దని... మీరు పొరపాటున ఆ రైళ్లను తాకితే అవి దెబ్బతింటాయని చెప్పారు. ఆవులు, బర్రెలు తగిలితే చిద్రమైపోయే రైళ్లను మోదీ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. మన దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతానని చెప్పిన మోదీ వందేభారత్ రైళ్లను తీసుకొచ్చారని విమర్శించారు. ఆ రైళ్లను ప్రవేశ పెట్టకుండా మోదీని ఎలాగూ ఆపలేమని... అందుకే, మీరే ఆ రైళ్ల వైపు వెళ్లవద్దని బర్రెలకు చెప్పారు. వందేభారత్ రైళ్లు వెళ్లే ట్రాక్ వద్దకు వెళ్లొద్దని అన్నారు.